ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ

Published Mon, Feb 17 2025 1:25 AM | Last Updated on Mon, Feb 17 2025 1:25 AM

ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ

ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ

హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండ హంటర్‌ రోడ్డులోని వేద బాంక్వెట్‌ హాల్‌లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్‌లో జరిగిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ టీచర్స్‌ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో అసంతృప్తిని మూటగట్టుకుంటే.. కాంగ్రెస్‌ ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్‌ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్ల గొండ–వరంగల్‌–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్‌–కరీంనగర్‌–నిజా మాబాద్‌–ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజ యం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగా హన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి ఆయన అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపా రు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్‌.పి.జయంత్‌లాల్‌, డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్‌ కాళీప్రసాద్‌, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, చాడా సరిత, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలి : ఎమ్మెల్యే నాయిని

ఇదిలా ఉండగా.. వరంగల్‌ మహానగర అభివృద్ధి కి కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు వేద బాంక్వెట్‌ హాల్‌ వద్ద ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర నుంచి వరంగల్‌ మహానగరానికి వివిధ పథకాల కింద రావాల్సిన నిధులను విడుదల చేయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర పురావస్తు శాఖలో ఉన్న వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కిషన్‌రెడ్డి నిధుల విడుదలకు సహకరిస్తానని తెలిపారు. పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షు డు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement