
సేవలు మరింత చేరువ
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అత్యుత్త మ సేవలందించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా విద్యుత్ సర్వీసుల మంజూరు ను మరింత సులభతరం చేసింది. వినియోగదారు లకు కొత్త సర్వీసుల మంజూరులో డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చా రు. ఇకపై ఏదైనా కారణంచేత దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంటే దాన్ని తిరస్కరించకుండా మంజూరుకు అవసరమైన ప్రక్రియను పూర్తి స్థాయిలో అందించేలా విద్యుత్ శాఖ మరో అవకా శం కల్పించింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో తెలి యక దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరిగే వారు. ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక కార్యాలయం చుట్టూ తిరిగాల్సిన అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్‌తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్‌సైట్ నుంచి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో ఉన్న అప్లికేష న్ స్థితిని తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి చెందకపోతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
అందుబాటులోకి
అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం
విద్యుత్ వినియోగదారులకు
తప్పిన తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment