
అమెరికా అమ్మాయి.. నీరుకుళ్ల అబ్బాయి
హన్మకొండ చౌరస్తా: అమెరికా దేశంలోని టొరంటోకు చెందిన జెస్సికా, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన సతీష్ వివాహం ఆదివారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ సమీప ఏఆర్‌ఆర్ గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ వివాహానికి అమ్మాయి తల్లి, సోదరి మరో ఇద్దరు బంధువులు, వరుడి తరఫు బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సతీష్‌కు 2021 సంవత్సరం కరోనా సమయంలో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో జెస్సికా పరిచయం అయింది. అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరి మనసులను అర్థం చేసుకున్న ఇరువురి తల్లిదండ్రులు వేదమంత్రా ల సాక్షిగా వివాహతంతు జరిపించి ఒక్కటి చే శారు. ఈ వివాహ వేడుకను చూసిన బంధువులు, స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment