
చెస్‌తో మేధస్సు పెంపు
వరంగల్ స్పోర్ట్స్: చదరంగంతో మేధస్సు పెరుగుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జి ల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలను ఆది వారం ఎమ్మెల్యే నాయిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడే జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొంటామన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 170 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు నాలుగు రౌండ్లు ముగియగా అందులో అల్లాడి శ్రీవాట్సన్, రజనీకాంత్, కొమురవెల్లి, వివేక్, ఆధ్య, రవీంద్రనాథ్ ముందంజలో ఉన్నారని తెలిపారు. టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ఆర్బిటర్లు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
● జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment