సీనియార్టీ తేల్చడంలో జాప్యమెందుకు? | - | Sakshi
Sakshi News home page

సీనియార్టీ తేల్చడంలో జాప్యమెందుకు?

Published Mon, Feb 17 2025 1:27 AM | Last Updated on Mon, Feb 17 2025 1:27 AM

-

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో తెలు గు విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ ఏటూరి జ్యోతి ఈఏడాది జనవరి 9న మృతి చెందిన విషయం వి ధితమే. అయితే ఆ విభాగంలో రెగ్యులర్‌ ప్రొఫెస ర్లు లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెస ర్లు మామిడి లింగయ్య, మంథిని శంకర్‌, చిర్రరాజు , కర్రె సదాశివ్‌ ఉన్నారు. ఆ నలుగురిలో సీనియార్టీ ప్రాతిపదికన ఒకరిని విభాగం అధిపతిగా, మరొకరిని బోర్డు ఆఫ్‌స్టడీస్‌ చైర్మన్‌గా నియమించాల్సింటుంది. అయితే ఆ నలుగురు కూడా ఆ పదవులు ఆశిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీరిలో ఎవరిని విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్‌స్టడీస్‌ చైర్మన్‌గా నియమించడానికి సీనియార్టీ తేల్చాలని వీసీ ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది జనవరి నెలాఖరులో అ ప్పటి రిజిస్ట్రార్‌ పి. మల్లారెడ్డి ఈ కమిటీని నియమి స్తూ వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కమిటీని నియమించి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకూ రిపోర్టు ఇవ్వలేదు. దీంతో ఈ కమిటీని నియమించింది కాలయాపనకేనా? ఇంకెప్పుడు సీనియార్టీని తేలుస్తారని ఆ నలు గురు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నా రు. జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటీని యూ నివర్సిటీలో చర్చ సాగుతోంది. అయితే కమిటీ మాత్రం ఆరోపణలు పట్టించుకోదని, తాము ఆ నలుగురిలో సీనియార్టీని మాత్రమే పరిశీలించి త్వరలోనే రిపోర్టు అందజేస్తామని కమిటీలో ఉన్న ఓ ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 17న కమిటీ సమావేశమై సీనియార్టీని తేల్చి రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఆ నలుగురిలో ఎవరు విభాగం అధిపతి, బీఓఎస్‌గా నియామకం అవుతారనే అంశం యూనివర్సిటీలో ఆసక్తికరంగా మారింది.

కమిటీని నియమించి రెండువారాలు

ఇంకా సమర్పించని నివేదిక

తెలుగు అధిపతి, బీఓఎస్‌

నియామకమెప్పుడు?

నేడు కమిటీ సమావేశమయ్యే అవకాశం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement