
ప్రజాప్రభుత్వంలో సోషల్ మీడియా పాత్ర కీలకం
హన్మకొండ చౌరస్తా: పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సోషల్ మీడియా కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేశారని, ప్రజాప్రభుత్వ ఏర్పాటులో సోషల్ మీడియా పాత్ర కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ నేహాల్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ‘సోషల్ మీడియా వారియర్స్– కాఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్‌మీడియా విశేష కృషి చేసిందన్నారు. పదేళ్లలో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన కార్యకర్తల పై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్‌మీడియా వారియర్స్ శ్రమను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారి ‘కాఫీవిత్ ఎమ్మెల్యే కార్యక్రమం’ చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ నాయి ని గోదావిష్ణువర్ధన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షరాలు బంక సరళ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రమేశ్, నాయకులు తిరుపతిరెడ్డి, జీవన్‌రెడ్డి, హుస్సేన్, లక్ష్మి, భరత్, చందు, రమేశ్ పాల్గొన్నారు.
● ‘కాఫీ విత్ ఎమ్మెల్యే’
కార్యక్రమంలో నాయిని

ప్రజాప్రభుత్వంలో సోషల్ మీడియా పాత్ర కీలకం
Comments
Please login to add a commentAdd a comment