
అర్ధశతాబ్దపు అపూర్వ కలయిక..
కురవి: ఆ విద్యార్థులు అర్ధ శతాబ్దం తరువాత కలు సుకున్నారు. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒకచోట కలిసి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. అనంతరం జ్ఞాపకాలను నెమరువేసుకుని రోజంతా ఉల్లాసం, ఉత్సాహంగా గడిపారు. ఈ అపురూప ఘట్టానికి మండలంలోని బలపాల జెడ్పీ హైస్కూ ల్ వేదికై ంది. పాఠశాలకు చెందిన 1971–1972 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కలియ తిరిగారు. తరగతి గదులను పరిశీలిస్తూ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం తమతో చదువుకుని చనిపోయిన స్నేహితులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిలారి అశోక్‌బాబు, చింతలమోహన్‌రావు, చిక్కా వెంకటేశ్వర్లు, తాటికొండ మల్లారెడ్డి, రావూరి విమల, దార నర్సింహరావు, రావూరి రమేశ్, ఈడిగిరాల ఐలయ్య, బొల్ల వసంత, గరక వెంకటేశ్వర్లు, కె.పద్మ , నామా సైదులు, రావూరి ప్రభాకర్‌రావు, అంబటి వెంకటనారాయణ పాల్గొన్నారు.
54 ఏళ్ల తర్వాత కలుసుకున్న
పూర్వ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment