జాతీయవాద రచనలకు కేంద్రబిందువు సదాశివరావు
● ప్రముఖ రచయిత వరిగొండ కాంతారావు
హన్మకొండ కల్చరల్ : జాతీయవాద రచనలకు కేంద్రబిందువుగా స్వర్గీయ భండారు సదాశివరావు అని ప్రముఖ రచయిత వరిగొండ కాంతారావు అన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ అధ్యక్షుడు భండారు సదాశివరావు స్మారకగా ఆదివారం హంటర్‌రోడ్‌లోని శ్రీవ్యాస ఆవాసంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘హిందువుగా జీవించు–హిందువునని గర్వించు’ అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. భండారు సదాశివరావు రచనలు ‘అగ్నిమూర్తులపై’ న్రముఖ రచయిత ఐత చంద్రయ్య, ‘పృథ్వీసూక్తం’పై వరిగొండ కాంతారావు ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీవ్యాస ప్రతిష్టాన్ సంఘం ప్రధాన బూర రాయచందర్, జాతీయ సాహిత్య పరిషత్ హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తాడిచెర్ల రవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బీఎస్ శివసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment