
ఆన్‌లైన్.. ఆగమాగం!
ట్రైన్ పాస్‌లు, పీటీఓలు, లీవ్‌లు ఆన్‌లైన్‌లో మంజూరు
● వినియోగించుకోలేకపోతున్న 70 శాతం మంది రైల్వే కార్మికులు
● ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచాలని విన్నపం
● రైల్వే నాయకులు పట్టించుకోవాలని మొర
కాజీపేట రూరల్: ఎన్నో ఏళ్లు ఎందరో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రైల్వే కార్మికుల హక్కులు పూర్తి స్థాయిలో కార్మికులు అందుకోలేకపోతున్నారు. ఇప్పటికే రైల్వే కార్మికుల హక్కులు చాలా వరకు కనుమరుగవ్వగా.. కొన్నింటి కోసం ఇప్పటికీ కార్మికులు, నాయకులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో కొంత కాలంగా రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల కనీస హక్కులను ఆన్‌లైన్ చేయడంతో వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేయడం తెలియని 70 శాతం మంది రైల్వే కార్మికులు ఆన్‌లైన్‌లో తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలో తెలియక ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది.
రైల్వే కార్మికులకు తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణించేందుకు సంవత్సరానికి మూడు ఉచిత ప్రివిలేజ్ ట్రైన్ పాస్‌లు ఇచ్చేది. అత్యవసర పరిస్థితులున్నప్పుడు, సెలవుల కోసం అర్జీ పెట్టుకుంటే సెలవులు ఇస్తారు. అదేవిధంగా క్యాజువల్ లీవ్ (సీఎల్) మంజూరు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (పీటీఓ) మంజూరు ఇవన్నీ... రైల్వే ఆన్‌లైన్ చేయడం వల్ల చాలా వరకు రైల్వే కార్మికులు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ సిస్టంలో అప్లయ్, ఆప్‌లోడ్, ఓటీపీ, ఫార్వర్డ్, డౌన్‌లోడ్ విధానం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రివిలేజ్ పాస్ తీసుకునే విధానం తెలియక కొందరు కొంత కాలం నుంచి ట్రైన్‌పాస్‌లు తీసుకోవడం లేదని కార్మికులు చెబుతున్నారు ఆన్‌లైన్‌లో ట్రైన్ పాస్ ద్వారా ఒక సారి ప్రయాణం చేస్తే మరొకసారి ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయిందని, గతంలో సంవత్సరానికి మూడు ప్రివిలేజ్ ట్రైన్ పాస్‌లు ఇచ్చేవారని, ఈ పాస్‌లపై ఎన్నిసార్లు అయిన ప్రయాణించే అవకాశం ఉండేదని అంటున్నారు. ముఖ్యంగా కింది స్థాయి గ్రూప్ డి, నాలుగో తరగతి రైల్వే కార్మికులు గ్యాంగ్‌మెన్లు, గ్యాంగ్ ఉమెన్లు, గేట్‌మెన్లు, కీ మెన్లు, అటెండర్లు, డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్‌లోషెడ్, ట్రైన్‌లైటింగ్, సిఅండ్‌డబ్ల్యూ స్టాప్, టీటీ మిషన్ స్టాప్ తదితర కార్మికులు ఆన్‌లైన్‌లో తమ హక్కులను పొందలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. రిటైర్డ్ రైల్వే వారికి ఇస్తున్న మాదిరిగానే సర్వీస్‌లో ఉన్న వారికి కూడా మ్యాన్యుల్‌గా ఇస్తే ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు రైల్వే కార్మికుల కనీస హక్కులను ఆన్‌లైన్‌లో కాకుండా పాత పద్ధతిలో అమలు చేసేలా రైల్వే బోర్డు, జీఎం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ పాస్‌లు ఎత్తివేయాలి..
కార్మికులు తమ ఇంటిల్లిపాదితో కలిసి ఉచిత ట్రైన్‌పాస్‌తో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆన్‌లైన్ చేయడం వల్ల ఆ అవకాశం లేకుండాపోయింది. అత్యవసర సెలవులకు సీఎల్ కార్డు చూపిస్తే లీవ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సిస్టం లేదు. రైల్వే కార్మికుల ఇబ్బందులు గుర్తించి అధికారులు ఆన్‌లైన్ సిస్టం ఎత్తివేసి మ్యాన్యువల్ అమలు చేస్తే బాగుంటుంది.
– దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్
●
ఆన్‌లైన్ చేసినవి ఇవే..
ఆన్‌లైన్ తెలియక..

ఆన్‌లైన్.. ఆగమాగం!

ఆన్‌లైన్.. ఆగమాగం!

ఆన్‌లైన్.. ఆగమాగం!
Comments
Please login to add a commentAdd a comment