
రామప్ప శిల్పాకళా సంపద అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పాకళా సంపద అద్భుతమని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా, ఆలయ ఆర్చకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో రామప్ప ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ప్రస్తుతం రామప్ప ఆలయాన్ని మళ్లీ సందర్శించినట్లు వెల్లడించారు. ఆమె వెంట ఓఎస్‌డీ మహేశ్ భగవత్ గీతె, ములుగు డీఎస్పీ రవీందర్, జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా
Comments
Please login to add a commentAdd a comment