
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాలబాలికల ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు సోమవా రం ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్, తర్వాతి స్థానా ల్లో మ్యాకల శ్రీకాంత్, తుర్క రాజు, రవీంద్రనాథ్ , తిరుపతిచారి, ఆద్య, సుదీప నిలిచారు. విజేతలకు నిర్వాహకుడు పి. కన్నా సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బి టర్లు శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, రజనీకాంత్, శ్రీకాంత్, రవీందర్ పాల్గొన్నారు.
చోరీకి యత్నించిన కేసులో వ్యక్తికి ఏడాది జైలు
చిన్నగూడూరు: మండలంలోని ఉగ్గంపల్లి శివారు దేవోజీతండాలో ఓ ఇంట్లో చోరీకి యత్నించిన కేసులో నిందితుడికి తొర్రూరు మేజిస్ట్రేట్ మట్ట సరిత ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. నల్లగొండ జిల్లా గుర్రంపాడు మండలం తేనెపల్లికి చెందిన శివర్ల కోటేశ్ 2023లో దేవోజీతండాకు చెందిన ధర్మసోత్ భూపాల్ నాయక్ ఇంటిలో చోరీకి యత్నించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కోటేశ్‌పై కేసు నమోదు చేశారు. సోమవారం కేసు విచారణ అనంతరం తొర్రూరు మేజిస్ట్రేట్ మట్ట సరిత.. నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించారు. కాగా, నిందితుడికి శిక్షపడేలా విధులు నిర్వర్తించిన కోర్టు పీసీ మధును తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, మరి పెడ సీఐ రాజ్‌కుమార్, చిన్నగూడూరు ఎస్సై ఝాన్సీ అభినందించారు.
రూ.38,720 విలువైన గుట్కాలు స్వాధీనం
ఖిలా వరంగల్: అక్రమంగా గుట్కాలు విక్రయిస్తున్న కిరాణా వ్యాపారిపై కేసు నమోదు చేసి రూ. 38,720ల విలువైన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్ తెలిపారు. వరంగల్ 36వ డివిజన్ చింతల్‌కు చెందిన కిరాణా షాపు నిర్వాహకుడు చిదిరాల సుమన్ అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సోమవారం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్ ఆధ్వర్యంలో షాపుపై దాడి చేశారు. ఇందులో రూ. 38,720 విలువైన గుట్కాప్యాకెట్లు లభించగా స్వాధీనం చేసుకుని సుమన్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన చదరంగం పోటీలు

ముగిసిన చదరంగం పోటీలు

ముగిసిన చదరంగం పోటీలు
Comments
Please login to add a commentAdd a comment