
పర్యాటకులకు గుడ్‌న్యూస్..
హన్మకొండ : పర్యాటకులను ప్రోత్సహించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఒక్క రోజు పర్యాటక ప్రాంతాల సందర్శన టూర్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ఈ టూర్ ప్యాకేజీ రూపొందించారు. మినీ ఏసీ బస్సులో పర్యాటకులను తీసుకెళ్లేలా టూర్ ప్యాకేజీ తీసుకొచ్చారు. ఈ నెల 20 ఉదయం 8 నుంచి రాత్రి 7.45 గంటల వరకు సాగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ నుంచి ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రారంభమవుతుంది. ముందు వేయిస్తంభాల దేవాలయానికి చేరుకుంటారు. 9 గంటలకు వేయి స్తంభాల దేవాలయం నుంచి భద్రకాళి దేవస్థానానికి, ఇక్కడి నుంచి రామప్పకు చేరుకుంటుంది. రామప్పలో మధ్యాహ్న భోజన అనంతరం లక్నవరం నుంచి నేరుగా సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. తేనీరు తీసుకున్న తర్వాత ఖిలావరంగల్‌కు చేరుకుని సౌండ్ లైటింగ్ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు, ఖిలావరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి రాత్రి 7.45 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. వివరాల కోసం 9010007261 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని పర్యాటకాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో కోరింది. సంస్థ వెబ్ సైట్‌లోనూ వివరాలు పొందుపరిచినట్లు తెలిపింది. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించారు.
ఒక్క రోజు పర్యాటక ప్రాంతాల సందర్శన
టూర్ ఏర్పాటు చేసిన తెలంగాణ
పర్యాటకాభివృద్ధి సంస్థ

పర్యాటకులకు గుడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment