
నేడు అగ్రిహబ్ రీజినల్ సెంటర్ ప్రారంభం
హన్మకొండ: వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చే సిన అగ్రిహబ్ రీజినల్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ఎ.జానయ్య ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయంలో స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడానికి ఈ అగ్రిహబ్‌ను ఇక్కడ స్థాపించినట్లు వివరించారు.
వంద క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
చెన్నారావుపేట: అక్రమంగా నిల్వ చేసి వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం మండలంలోని పాత మగ్దుంపురం గ్రామంలోని ననుమాస పవన్‌కుమార్ ఇంటిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇందులో వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యంకాగా స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు. నిల్వ చేసిన రేషన్ బియ్యం విలువ సుమారు రూ. 2 లక్షల 50 వేలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ బాబులాల్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment