24 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్‌లో హరప్రసాద్ సాహూ అనే వ్యక్తి వద్ద సుమారు రూ.6లక్షల విలువైన 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కోదల గ్రామానికి చెందిన హరప్రసాద్ సాహూ సోమవారం గంజాయితో వరంగల్ రైల్వేస్టేషన్‌లో దిగి క్రయవిక్రయదారుల కోసం వేచి ఉన్నాడు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అతడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ షుకూర్ తెలిపారు.
డోర్నకల్‌లో 19.68 కేజీలు..
డోర్నకల్ : డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ క్రాస్ వద్ద సోమవారం పోలీసులు ఎండు గంజాయి పట్టుకున్నారు. ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ క్రాస్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా 19.68 కేజీల ఎండు గంజాయి లభించింది. దీంతో ఒడిశాకు చెందిన సమర భూమియా, సీసీఎల్, మహదేవ్ మండల, ఉమేశ్ మండలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.4,92,000 ఉంటుందని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment