నిబంధనలు పాటిస్తేనే నిర్మాణ అనుమతులు
వరంగల్ అర్బన్ : భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరు.. పెద్ద భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ల జారీ కోసం ఆమె సోమవారం నగర పరిధి సుబేదారి ప్రాంతంలోని పోస్టల్‌కాలనీ, ప్రకాశ్‌రెడ్డిపేట, లోటస్‌కాలనీ, కాజీపేట ప్రాంతాల్లో పర్యటించి ఫిర్యాదులను, మ్యాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీఎస్–బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో సూచించిన ధ్రువీకరణ పత్రాలు నమోదు చేసి నిబంధనలు పాటిస్తే చట్టానికి లోబడి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. కమిషనర్ వెంట ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఉన్నారు.
బల్దియా కమిషనర్
అశ్విని తానాజీ వాకడే
Comments
Please login to add a commentAdd a comment