
పురాతన కట్టడాలను కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్ : పురాతన దేవాలయాలు, కట్టడాలను కాపాడుకుంటే చరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సౌమ్యమిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆమెను ఆలయమర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి బిల్వార్చన, పూజలు చేసిన అనంతరం ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు, డీసీపీ దేవేందర్‌రెడ్డి, హనుమకొండ సీఐ సతీశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment