
హనుమకొండ డీవీఏహెచ్‌ఓ ఎవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్ :
హనుమకొండ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి (డీవీఏహెచ్‌ఓ)గా కొత్తగా ఎవరిని నియమించనున్నారు? అన్న అంశం ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు డీవీఏహెచ్‌ఓగా ఉన్న వెంకటనారాయణ పదవీ విరమణకు కొద్ది నెలలే గడువున్నా.. సొంత జిల్లా ఖమ్మం జిల్లాకు మంగళవారం బదిలీ అయ్యారు. వెటర్నరీ, పశుసంవర్థకశాఖలో సంయుక్త సంచాలకులుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబసాచి ఘోష్ బదిలీ చేశారు. అందులో భాగంగా సిద్దిపేటకు అశోక్‌కుమార్, మంచిర్యాలకు కృష్ణ, కరీంనగర్‌కు సుధాకర్, నల్లగొండకు రమేష్‌ను నియమించిన ప్రధాన కార్యదర్శి ఘోష్.. హనుమకొండ డీవీఏహెచ్‌ఓ నుంచి ఏడీగా పదో న్నతి పొందిన వెంకటనారా యణను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రకా లుగా అనుకూలం.. హాట్‌కేక్‌లాంటి హనుమకొండ డీవీఏహెచ్‌ఓ పోస్టు కోసం పలువురు లాబీయింగ్ చేస్తున్నారు.
హైదరాబాద్ స్థాయిలో పావులు
ప్రధానంగా ఈ సీటుపై ఐదుగురు కన్నేయగా, పదో న్నతులు, ఫారిన్ సర్వీస్‌ల పేరిట సుమారు మూడు నెలల నుంచి కాచుకు కూర్చున్న సదరు వ్యక్తులు ఇప్పటికే వివిధ రూపాల్లో సమీప ప్రాంతాలు, కార్యాలయాల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులుగా పదోన్నతులు కలిగిన కొందరు ఫారిన్ సర్వీస్‌ల పేరిట డిప్యుటేషన్ పొందారు. ఐదారు నెలల్లో పదవీ విరమణ పొందే హనుమకొండ ‘బాస్’ సీటుకు కొందరు స్కెచ్ వేయగా.. వివిధ రూపాల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో పనిచేస్తున్న మరికొందరు ఇప్పటికే హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఉంది. హనుమకొండ డీవీఏహెచ్‌ఓ పోస్టు కోసం ముందస్తు వ్యూహాంతో పావులు కదపడం.. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎడాపెడా సాగిన ‘డిప్యుటేషన్’ల దందాపై ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనాలు కలకలం రేపాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపించి షోకాజ్‌లు జారీ చేయడంతో కొంత సద్దుమణిగినా.. ఆ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులు హనుమకొండ డీవీఏహెచ్‌ఓ పోస్టు కోసం పైరవీలు చేస్తున్న విష యం ఆ శాఖలో మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది.
సొంత జిల్లా ఖమ్మానికి
వెంకటనారాయణ బదిలీ
డీవీఏహెచ్‌ఓ కోసం పోటాపోటీగా
ప్రయత్నాలు, పైరవీలు
హనుమకొండ సీటుపై ఐదుగురి కన్ను
ఇప్పటికే డిప్యుటేషన్లపై ఉన్న కొందరు
పశుసంవర్థకశాఖలో హాట్‌టాపిక్
Comments
Please login to add a commentAdd a comment