
టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరి లో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీలో తొలుత ప్రిన్సి పాల్ జ్యోతిని కలిశారు. అనంతరం పలువురు అధ్యాపకులతో మాట్లాడారు. తనను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళమెత్తుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట యూనియన్ బాధ్యులు డాక్టర్ కుందూరు సుధాకర్, ఎస్‌కే మీరుద్దీన్, రవీందర్‌రెడ్డి ఉన్నారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు
చేయించాలి : డీఈఓ
విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలని డీఈఓ వాసంతి కోరారు. గత సంవత్సరం 968 పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దృష్టి లోపం ఉన్న 137 పాఠశాలల్లోని 2,357 మంది విద్యార్థులకు ఈనెల 17 నుంచి 28 వరకు వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, ఇతర ఉపకరణాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి మండలంలో ఎంపికచేసిన విద్యార్థులు కంటి పరీక్షలకు వెళ్లేవిధంగా మండల విద్యాశాఖాధికారులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. అదనపు సమాచారం కోసం సమగ్రశిక్ష సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి ఫోన్‌నంబర్ 9603672289ను సంప్రదించాలని డీఈఓ కోరారు.
ఉపాధ్యాయుల
గొంతు వినిపిస్తా..
నయీంనగర్: ఉపాధ్యాయుల గొంతుకనై వారి సమస్యలు పరిష్కరిస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. ఆరేళ్లుగా ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యల సాధనకు కృషి చేశానన్నారు. ప్రభుత్వ విద్యారంగం, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను రక్షించడానికి పాటుపడుతానన్నారు.
20 నుంచి దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, మార్చి 1తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
ఎంఏ జర్నలిజం,హెచ్‌ఆర్‌ఎం పరీక్షలు
కేయూ దూరవిద్య ఎంఏ జర్నలిజం, ఎంఏ హెచ్‌ఆర్‌ఎం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment