ఖిలా వరంగల్ : వినియోగదారుల హక్కుల రక్షణే ధ్యేయమని వినియోగదారుల జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి అన్నారు. ఈమేరకు బుధవారం శివనగర్‌లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 15లోపు 33 జిల్లాలో నూతన కమిటీలను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం జిల్లా, మండల కమిటీలను ఆయన ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గన్నోజు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఆరెబెల్లి సందీప్, సిటీ అధ్యక్షుడిగా మురహరి కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా బేతి రాజేష్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడిగా దుగ్యాల తరుణ్, కార్యదర్శిగా బత్తిని అనిల్‌కుమార్, హనుమకొండ మండల అధ్యక్షుడిగా గంగరాజు, సతీష్, ప్రధాన కార్యదర్శిగా రామోజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment