
కార్పొరేట్‌కు అనుకూలంగా బడ్జెట్
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్‌కు అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వివక్ష చూపడంపై బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నాయకులు చేతికి సంకెళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలును బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలేదన్నారు. లక్షలాదిమంది యువకులకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టును మూలకు పడేయడం దారుణమన్నారు.బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం ద్వారా దేశీయ ఎల్‌ఐసీ, జీఐసీలపై ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ఎన్.జ్యోతి, సదాలక్ష్మి, కె.శివాజీ, ఎస్.వాసుదేవ రెడ్డి, ఎ ం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, మద్దెల ఎల్లేష్, ఉ ట్కూరి రాములు, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, రాసమల్ల దీనా, బత్తిని సదానందం, మా లోతు శంకర్ నాయక్, సుదర్శన్, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, రొంటాల రమేష్, దేవా, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, నిమ్మల మనోహర్, వీరన్న నాయక్, జి.రాములు, సాంబయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్‌లో..
వరంగల్ చౌరస్తా : కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 10 కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్‌లో ధర్నా చేశారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూడెమొక్రసీ నేత రాచర్ల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, పలు పార్టీల నాయకులు గంగుల దయాకర్, అక్కెనపల్లి యాదగిరి, సుంచు జగదీశ్వర్, సత్యనారాయణ, ఎండీ బషీర్, ఆడెపు సదయ్య, పనాస ప్రసాద్, ఐతం నగేశ్, టి.భవాని, దుర్గయ్య, ఇనుముల శ్రీనివాస్, రంజిత్, గన్నారపు రమేశ్, గండ్రతి హరిబాబు, ప్రశాంత్, మాలి ప్రభాకర్, దేశెట్టి సమ్మయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment