హన్మకొండ: హనుమకొండ జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారిగా విజయభాస్కర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న కె.వెంకటనారాయణ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. కాగా.. పరకాల ఏరియా పశు వైద్య కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న విజయభాస్కర్‌కు పూర్తి అదనపు ఇన్‌చార్జ్ బాధ్యతలతో హనుమకొండ జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారిగా నియమించగా.. గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన విజయభాస్కర్‌ను పశువైద్యులు, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment