క్లబ్‌లో 13మంది సభ్యులు
అసాధారణ ప్రవర్తన కలిగిన పిల్లల గుర్తింపు.. నిఘా
హనుమకొండ జిల్లాలోని 128 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో సంయుక్తంగా పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నివారణకు ప్రహరీక్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 128 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారు 4వేల మంది విద్యార్థులకు ఆరోగ్యశాఖ, పోలీస్‌శాఖవారితో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లోనూ ప్రహరీక్లబ్‌ల ఏర్పాటుకు ఉపక్రమించినట్లు గురువారం హనుమకొండ డీఈఓ డి.వాసంతి, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ట్రోల్‌ఫ్రీ నంబర్ 1908
పాఠశాలల్లోని ప్రహరీ క్లబ్ సభ్యులు వారి పాఠశాలల్లో కానీ, ఆవాస ప్రాంతాల్లో కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు, విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కి కాల్ చేసి చెప్పాలి. లేదా గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. దీనిద్వారా సులభంగా డ్రగ్స్‌ను కట్టడిచేయవచ్చనే భావన. తరగతి గదిలో ఇతర విద్యార్థులతో కలవకుండా ఒంటరిగా ఉండే పిల్లల మీద కూడా ప్రహరీక్లబ్ నిఘా ఉండాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment