
పదేళ్ల పాలనలో ఏం చేశారు?
హన్మకొండ చౌరస్తా : మామునూరు ఎయిర్ పోర్టుకు అనుమతులు తీసుకురాకుండా పదేళ్ల పాలనలో ఏం చేశారని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. వరంగల్‌ను డల్లాస్ చేస్తా, ఆక్సిజన్ పార్కు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వంటి హామీలు ఇచ్చిన కేసీఆర్ పదేళ్ల పాలనలో నగర అభివృద్ధికి తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, ఉద్యోగుల నియామకం, వైద్యపరికరాల కొరతను పట్టించుకోని నాటి బీఆర్‌ఎస్ సర్కార్, కమీషన్ల కోసం జైలు స్థలం పేపర్లను మహారాష్ట్ర బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.వేల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే డివిజన్ హోదా సాధనకు ఈ నెల 9వ తేదీన ఎంపీ కావ్యతో కలిసి ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కోరనున్నామని తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి రూ.6వేల కోట్ల నిధులు మంజూరు చేసిన ఏకై క సీఎం రేవంత్‌రెడ్డి అని వివరించారు. ఎయిర్‌పోర్టు స్థల సేకరణకు రూ.205 కోట్లు మంజూరు చేశారని, స్థల సేకరణలో రైతులను రెచ్చగొట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని, అది సరైంది కాదని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడ ర్ తోట వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీని వాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వీ సం సురేందర్‌రెడ్డి, పింగిళి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
నగర అభివృద్ధికి తట్టెడు మట్టిపోయలే..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
రైతులను రెచ్చగొట్టడం సరికాదు:
ఎంపీ కావ్య
Comments
Please login to add a commentAdd a comment