గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

Published Thu, Mar 6 2025 1:26 AM | Last Updated on Thu, Mar 6 2025 1:26 AM

గురువ

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

8లోu

సరైన మోతాదులో

అందని ప్రాణవాయువు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసేందుకు ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఎంసీ, ఐఎంసీ, క్యాజువాలిటీ, ఐసీఎస్‌యూ, ఆర్‌ఐసీయూ వంటి వార్డులు చాలా కీలకం. ఇలాంటి వార్డులను నిత్యం పర్యవేక్షిస్తూ వైద్యులున్నారా? ఎలాంటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి? ఆక్సిజన్‌ సరఫరా ఎలా ఉంది? డ్యూటీ వైద్యులు వస్తున్నారా? అనే విషయాలను ఆర్‌ఎంఓలు, సూపరింటెండెంట్లు నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

హనుమకొండలోని

పలు ఆస్పత్రుల తనిఖీ

ఎంజీఎం : జిల్లాలో గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం (పీసీఅండ్‌పీఎన్‌డీటీ), మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాల అమలు తీరు పరిశీలనలో భాగంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య బుధవారం హనుమకొండలోని పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు 181, 104, 1098 లేదా డయల్‌ 100కు తెలపాలని సూచించారు. వారిపై చర్యలు తప్పని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఓఎంసీహెచ్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మంజుల, విప్లవ్‌, తదితరులు పాల్గొన్నారు.

‘అకుట్‌’ అధ్యక్షుడిగా

ప్రొఫెసర్‌ వెంకట్రామ్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (అకుట్‌) అధ్యక్షుడిగా ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ బి.వెంకట్రామ్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీగా మ్యాథమెటిక్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌పీ రాజ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఈనెల 4న జరిగిన ఎన్నికల్లో 75 మంది అధ్యాపకులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బుధవారం లెక్కింపు ప్రక్రియ నిర్వహించగా ప్రొఫెసర్‌ వెంకట్రామ్‌రెడ్డికి 41, మల్లికార్జున్‌రెడ్డికి 32 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. 8 ఓట్లతో వెంకట్రామ్‌రెడ్డి విజయం సాధించారు. జనరల్‌ సెక్రటరీ పదవికి డాక్టర్‌ ఎల్‌పీ రాజ్‌కుమార్‌కు 46 ఓట్లు, పి.శ్రీనివాస్‌కు 29 ఓట్లు వచ్చాయి. 17 ఓట్లతో రాజ్‌కుమార్‌ విజయం సాధించారు. విజయం సాధించిన ఇద్దరికి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణపత్రాలు అందించారు. ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ప్రొఫెసర్‌ సవితాజ్యోత్స్న, జాయింట్‌ సెక్రటరీగా వి.రాము, ట్రెజరర్‌గా డాక్టర్‌ డి.రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బ్రిడ్జి విస్తరణకు నిధులు

కేటాయించండి

హసన్‌పర్తి: హనుమకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని చింతగట్టు బ్రిడ్జి విస్తరణకు నిధులు కేటాయించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు బుధవారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. 40ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని, పలుచోట్ల దెబ్బతిన్నదని, వాహనాలరద్దీకి అనుగుణంగా విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రామ్‌ నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.

అత్యవసర సమయాల్లో రోగికి అందించే ఆక్సిజన్‌ ఎంజీఎంలో సరిగ్గా అందట్లేదు. పైపులు గోడలకు వేలాడుతున్నా.. పట్టించుకునేవారు లేరు. కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఖజానా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంజీఎంకు వచ్చే పేద రోగులకు ఎంత మేర ఆక్సిజన్‌ అందుతుందో తెలియదు. అడిగేవారూ లేరు. ఫలితంగా కొందరు అధికారులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

– ఎంజీఎం

ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరు, సమయపాలన పాటించకపోవడం రోగులకు ఓ సమస్య అయితే.. రోగులకు ప్రాణం పోసే ఆక్సిజన్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించడం మరో అవస్థ. ఆస్పత్రిలో పాలనాధికారులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యల్ని పట్టించుకోకపోవడం పేద ప్రజలకు శాపంగా మారింది. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద కొన్ని నెలల క్రితం వరుసగా ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఫిర్యాదుల పెట్టె, నిత్యం సమీక్షలు జరిపారు. ఓపీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. కానీ అత్యవసర సేవల్లో ఏ మాత్రం మార్పు లేదు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోగులకు ప్రాణాలు పోసే ఆక్సిజన్‌ వంటి సరఫరా వ్యవస్థలు మరమ్మతులకు నోచుకోవట్లేదు. దీంతోపాటు ఆస్పత్రిలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. వామ్మో ఎంజీఎం ఆస్పత్రి అనేలా ఆస్పత్రి పాలన తయారైందన్న ఆరోపణలున్నాయి.

అత్యవసరమా.. అంతే సంగతి!

నిత్యం పదుల సంఖ్యలో ప్రాణాపాయస్థితిలో ఎంజీఎంకు బాధితులు వస్తుంటారు. వెంటిలేటర్‌తో పాటు ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందుతుంటారు. శోకసంద్రంలో మునిగిపోతుంటారు. ప్రాణాలు పోసే ఏఎంసీ, ఐఏఎంసీ వంటి వార్డులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే పైపులైన్‌ ఏర్పాటు చేసి 15 నుంచి 20 ఏళ్లు గడుస్తున్న క్రమంలో కనీసం వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రోగికి అందాల్సిన ఆక్సిజన్‌ సరైన మోతాదులో అందని పరిస్థితి. ఓ క్రమ పద్ధతిలో ఉండాల్సిన ఆక్సిజన్‌ పైపులైన్ల నిర్వహణలో గోడకు వేలాడుతూ.. తీగలపై ఆధారపడి ఉండడమే ఇందుకు నిదర్శనం.

వృథా.. వ్యథ!

ఆక్సిజన్‌ సరఫరాలో ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో రోగికి ప్రాణవాయివు అందకపోవడం ఓ సమస్య అయితే.. వాడాల్సిన పరికరాలు (ఆక్సిజన్‌ ప్రెజర్‌ రెగ్యులేటర్స్‌) వాడకపోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్‌ వాడకం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద నిర్వహణ సరిగ్గా లేక ప్రతీరోజు 500 నుంచి 600 పాయింట్స్‌ మాత్రమే వాడాలి. కానీ ప్రస్తుతం 900 నుంచి 1,100 పాయింట్స్‌ వినియోగిస్తున్నారు. అయితే దీని ద్వారా ఎవరైతే టెండర్‌లో ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారో సదరు కాంట్రాక్టర్‌ ధనార్జన సాగేందుకు ఆస్పత్రి సిబ్బంది మరమ్మతులు చేయకుండా, పరికరాలు అందించకుండా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

హనుమకొండ జిల్లాలో 673 మంది, వరంగల్‌లో 267మంది గైర్హాజరు

పలు కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ,

అడిషనల్‌ కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు

రాయపర్తిలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20251
1/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20252
2/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20253
3/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20254
4/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20255
5/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20256
6/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20257
7/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 20258
8/8

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement