
ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం షురూ అయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. జిల్లాలోని 55 కేంద్రాల్లో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. ఉదయమే 8–30గంటల వరకే ఎక్కువశాతంమంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, తనిఖీ చేసి లోనికి అనుమతించారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా అనుమతించారు. మొదటిరోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల జరిగిన పరీక్షల్లో జనరల్ విభాగంలో 19,412మంది విద్యార్థులకు 18,815మంది హాజరుకాగా 596మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,134మందికిగాను 1,057మంది హాజరుకాగా 77 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 20,546 మంది విద్యార్థులకుగాను 19,872మంది హాజరుకాగా, 673మంది గైర్హాజరాయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకటరెడ్డి వడ్డేపల్లిలోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ, నారాయణ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఽఖీ చేశారు. కేంద్రాల్లోని ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. డీఐఈఓ గోపాల్ కూడా పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. హనుమకొండలోని కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థి కాపీయింగ్ చేస్తుండగా హైదరాబాద్ ఇంటర్‌బోర్డు నుంచి వచ్చిన ఇద్దరు అబ్జర్వర్లు పట్టుకొని డీబార్ చేసినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు.
వరంగల్ జిల్లాలో
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం పరీక్షకు 5,372 మంది జనరల్ విద్యార్థులకు 5,175 మంది హాజరు కాగా.. 197 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 894 మంది ఒకేషనల్ విద్యార్థులకు 824 మంది హాజరుకాగా.. 70 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వరంగల్ ఎల్‌బీ కళాశాల కేంద్రంలో సంస్కృతం పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎల్‌బీ కళాశాల సెంటర్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఏసీపీ నందిరాంనాయక్, ఇన్‌స్పెక్టర్ గోపితో కలిసి పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.
పోలీసుల సాయం..
మడికొండ: కాజీపేటలోని క్షేత్ర కళాశాలలో సెంటర్ పడిన ఓ విద్యార్థి.. మడికొండ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలకు వచ్చాడు. పరీక్షకేంద్రం తెలియకపోవడం, అప్పటికే సమయం మించిపోవడంతో కంగారుపడుతుండగా గమనించిన మడికొండ ఇన్‌స్పెక్టర్ కిషన్ వెంటనే స్పందించారు.హెడ్ కానిస్టేబుల్ రాంచందర్‌ను పురమాయించి ద్విచక్ర వాహనంపై ఆ విద్యార్థిని సకాలంలో సరైన సెంటర్ చేర్చాడు. పోలీసులు చేసిన సాయానికి ఆ విద్యార్థి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం

ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం

ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం

ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment