విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కేడీసీ) ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో అంతర్జాతీయ సదస్సు ఉంటుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజారెడ్డి, సదస్సు కన్వీనర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు బుధవారం తెలిపారు. ‘ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇంగ్లిష్ లాంగ్వెజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీడిసిప్లినరీ కాంటెక్ట్స్’ ఇన్ ది కరెంట్ ఎరా’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చీఫ్ ప్యాట్రన్‌గా రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన (ఐఏఎస్) కో ప్యాట్రన్స్‌గా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాంవెంకటేష్ గౌరవ అతిథిగా కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఆర్ట్స్ డీన్ టి.మనోహర్, ఇతర అతిథులు హాజరుకానున్నారు. కెన్యానుంచి ప్రొఫెసర్ జి.కుప్పురం కీలకోపన్యాసం చేయనున్నారు. బంగ్లాదేశ్ నుంచి డాక్టర్ షేక్ మెహది హాసన్, హైదరాబాద్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ జి.దామోదర్ పాల్గొంటారు. సదస్సులో వివిధ రాష్ట్రాలు, విదేశాలనుంచి 150 పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. కేడీసీ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్
శ్రీదేవసేన రాక
కెన్యా ప్రొఫెసర్ కీలకోపన్యాసం
150 పరిశోధనాపత్రాల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment