వరంగల్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్‌టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ వరంగల్ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వివరాలకు ఓఎస్‌డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment