మా బంగారం ఇప్పించండి..
రాయపర్తి: బ్యాంకులో తామెంత బంగారం తనా ఖా పెట్టామో అంతే ఇప్పించాలంటూ డిమాండ్ చే స్తూ ఖతాదారులు గురువారం రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్‌బీఐ ఎదుట ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన రాయపర్తి ఎస్‌బీఐలో ఖాతాదారుల 19 కిలో బంగారం చోరీకి గురైన విషయం విధితమే. ఈ ఘటనలో బ్యాంకు అధికారులు సదరు బంగారంలో తరుగు తీసి డ బ్బులు చెల్లిస్తామని కొంతకాలంగా ఖాతాదారులకు చెబుతున్నారు. అయితే ఖాతాదారులు మాత్రం బ్యాంకులో తామెంత బంగారం తనాఖా పెట్టామో అంతే ఇవ్వాలని, లేనిపక్షంలో తరుగు తీయకుండా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని, మరో రెండు రోజుల్లో సమాచారం అందజేస్తానమ ని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు వెనుదిరిగారు. కాగా, బ్యాంకులో ఎలాంటి గొడవలు జరగకుండా ఎస్సై శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
ఖాతాదారుల డిమాండ్
రాయపర్తి ఎస్‌బీఐ ఎదుట ఆందోళన