కేయూ బడ్జెట్‌ ఆమోదం | - | Sakshi
Sakshi News home page

కేయూ బడ్జెట్‌ ఆమోదం

Mar 29 2025 12:54 AM | Updated on Mar 29 2025 12:54 AM

కేయూ బడ్జెట్‌ ఆమోదం

కేయూ బడ్జెట్‌ ఆమోదం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ రూపొందించిన 2025–26 అంచనా ప్రతిపాదనల బడ్జెట్‌ను తొలుత ఫైనాన్స్‌ కమిటీలోనూ ఆతర్వాత కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమవేశంలోనూ ఆమోదం లభించింది. 2024–25 వార్షిక నివేదిక, స్టాండింగ్‌ కమిటీ మినట్స్‌ కూడా ఆమోదించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈపాలక మండలి సమావేశంలో ఎజెండాలో పెట్టిన పలు అంశాలు చర్చించారు. కేయూ 23వ కాన్వకేషన్‌ను నిర్వహించేందుకు ఆమోదం లభించింది. 2022 ఆగస్టు 25న కేయూ 22వ కాన్వొకేషన్‌ నిర్వహించాక మళ్లీ కాన్వకేషన్‌ నిర్వహించలేదు ఇప్పుడు ఆమోదం లభించడంతో ఏప్రిల్‌ – మేలో నిర్వహించే అవకాశం ఉంది. నిర్వహణకు అయ్యే వ్యయానికి కూడా ఫైనాన్స్‌ కమిటీలో అప్రూవల్‌ లభించింది. క్యాంపస్‌లోని హెల్త్‌ సెంటర్‌లో ఇద్దరు వైద్యులను నియమించుకునేందుకు పాలక మండలి ఆమోదం లభించింది. 16 పీరియడ్‌ల వర్క్‌ లోడ్‌ కలిగిన పార్ట్‌టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్షన్‌కు పాలక మండలిలో ఆమోదం లభించలేదు. డిఫర్‌ అయ్యింది. రిజిస్ట్రార్‌గా రామచంద్రం నియామకానికి సంబంధించి పాలక మండలి ర్యాటిఫికేషన్‌ చేశారు. ఆచార్యులకు ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ.. ప్రభుత్వం ఇచ్చిన తేదీ నుంచే అమలవుతుందని అంతకంటే ముందు ఉద్యోగ విరమణ పొందినవారికి అవకాశం లేదని పాలక మండలి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈపాలక మండలి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ యోగితారాణా, తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్‌ దేవసేన, రాష్ట్ర, ఫైనాన్స్‌ డిప్యూటీ సెక్రటరీ సుజాత, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్‌ అనితారెడ్డి, పుల్లూరు సుధాకర్‌, ఆచార్య బి.సురేశ్‌లాల్‌, డాక్టర్‌ సుదర్శన్‌, డాక్టర్‌ రమ, డాక్టర్‌ సుకుమారి, డాక్టర్‌ నవీన్‌, ఫైనాన్స్‌ కమిటీ సమావేశంలో రిజిస్ట్రార్‌ రామచంద్రం, కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ తోట రాజయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కాన్వకేషన్‌ నిర్వహణకు పాలకమండలి ఓకే

పార్ట్‌టైం.. కాంట్రాక్టుగా కన్వర్షన్‌కు నో

ఈసారీ లోటు బడ్జెటేనా?

కేయూ అంచనా బడ్జెట్‌ రూ.428 కోట్లపైనే..

10లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement