వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలోని మోడల్ మార్కెట్‌లో తక్‌పట్టీలు ఇవ్వని కమీషన్ వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కూరగాయల మార్కెట్ పరిఽధిలో 110 కమీషన్ లైసెన్స్‌ల వ్యాపారులు ఉన్నారు. పేరుకు కమీషన్ వ్యాపారులే అయినా అందులో సుమారు 70మంది వరకు కొనుగోళ్లు నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్ పేరుతో తీసుకున్న మడిగెల ముందు చిల్లర వ్యాపారులకు అద్దెలకు ఇచ్చిన నెలకు రూ.10వేల నుంచి 15వేలకు ఆదాయం పొందుతున్నారు. దీనివల్ల వీరిలో మెజార్టీ వ్యాపారులు తక్‌పట్టీలు మార్కెట్ అధికారులకు ఇవ్వలేక పోతున్నారు. సుమారు రెండేళ్లుగా తక్ పట్టీలు ఇవ్వలేదని తెలిసింది. తక్‌పట్టీలు ఇవ్వని కమీషన్ వ్యాపారులకు రెండు రోజులుగా మార్కెట్ ఉద్యోగులు నోటీసులు అందజేస్తున్నారు.
మిర్చి వ్యాపారులకు నోటీసులు..
ఆరుగురు మిర్చి కమీషన్ వ్యాపారులకు బకాయిలు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈఏడాది ఫిబ్రవరి వరకు కొనుగోళ్లకు సంబంధించిన మార్కెట్ ఫీజులను ఒక్కొక్కొ వ్యాపారి రూ.లక్ష నుంచి నాలుగున్నర లక్షలు చెల్లించాంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా మార్కెట్ ఫీజులు చెల్లించినా మళ్లీ బకాయిలంటూ నోటీసులు జారీ చేయడంపై మిర్చి కమీషన్ వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనోటీసులపై మార్కెట్ అధికారి మాట్లాడుతూ కమీషన్ వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకులకు చెల్లించాల్సిన బకాయిలపై నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు. ఒక్క మిర్చి వ్యాపారులకే కాకుండా మిగతా కూరగాయలు కొనుగోళ్లు చేసిన వారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. ఈనోటీసులపై పునరాలోచన చేసి అదనపు చెల్లింపులను రద్దు చేయాలని మిర్చి కమీషన్ వ్యాపారులు కోరుతున్నారు.
మిర్చి వ్యాపారులకు బకాయిల నోటీసులు