
పోలీస్ కస్టడీకి రాజలింగమూర్తి హత్య నిందితులు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఫ్రిబవరి 19న జరిగిన నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ భూపాలపల్లి జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. రేణుకుంట్ల సంజీవ్, పింగిళి సీమంత్, మోరె కుమార్, దాసారపు కృష్ణ, కొత్త హరిబాబును నేటి(బుధవారం) నుంచి ఈ నెల 4వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అ నుమతి ఇచ్చింది. హత్యకు సంబంధించిన మ రిన్ని వివరాలు, సమాచారం కోసం వీరిని భూ పాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
32.750 కేజీల
గంజాయి పట్టివేత
● ఇద్దరు ఒడిశా వాసుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట
ఏసీపీ నర్సయ్య
వర్ధన్నపేట: వర్ధన్నపేట బస్టాండ్ సమీపం ఎస్‌బీఐ వద్ద 32.750 కేజీల గంజాయి పట్టుకుని ఇద్దరు ఒడిశా వాసులను అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం వర్ధన్నపేట బస్టాండ్ సమీపం ఎస్‌బీఐ వద్ద ఇద్దరు అనుమానస్పదంగా ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశాలోని గంజాం జిల్లా జ్యోతినగర్‌కు చెందిన సామ్సంగ్ దళ బెహరా, మరొకరు జ్యోతి నగర్ సురడకు చెందిన మార్తో రహేతోగా తెలిసింది. స్మగ్లర్ నయోని అనే మహిళ ద్వారా సామ్సంగ్ దళ బెహరా, మార్తో రహేతో గంజాయి రవాణా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇచ్చిన గంజాయి తీసుకుని ఒడిశాలోని చత్రాపూర్ వద్ద గత నెల 28వ తేదీన రాత్రి పూరి – తిరుపతి రైలు ఎక్కి 29న మధ్యాహ్నం విజయవాడ వద్ద దిగారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ– అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి సూరత్ వెళ్తున్న క్రమంలో వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు బోగీలు తనిఖీ చేస్తున్నారు. దీంతో బయపడి రైలు దిగి వరంగల్ బస్టాండ్ సమీపంలో రాత్రి గడిపారు. పోలీసుల భయంతో రెండు రోజులు వరంగల్‌లోనే గడిపిన అనంతరం మంగళవారం వర్ధన్నపేటకు చేరుకున్నారు. తిరిగి వరంగల్ వెళ్లడానికి బస్సు కోసం వర్ధన్నపేట ఎస్‌బీఐ ఎదుట వేచి చూస్తున్న సమయంలో వారిని అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నర్సయ్య తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.