
అగ్గి.. అడవి బుగ్గి
అటవీ దహనాలకు
పాల్పడితే చర్యలు
అటవీ దహనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మంటలు విస్తరించకుండా సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పశువుల కాపరులు, మోడెం కొట్టె కూలీలు అటవీ దహనాలకు కారకులుగా భావించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వన్యప్రాణులు వేటకు గురికాకుండా సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేయిస్తున్నాం.
– చంద్ర శేఖర్, సబ్ డీఎఫ్‌ఓ
కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాలు అనగానే పచ్చని అడ వి, ఎత్తైన గుట్టలు, వాగులు, వంకలు, అహ్లాదకర వాతావరణం గుర్తుకువస్తుంది. కానీ వేసవిలో మా త్రం ఆ గ్రామాలు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతాయి. ఎండాకాలంలో అడవి మొత్తం ఆకు రాల్చి మోడులా మారుతుంది. దీంతో ఎక్కడ చిన్న అగ్గి రవ్వ త గిలినా దావానలంలా విస్తరించి అడవినంతా ద హించి వేస్తుంది. ఫలితంగా అడవి అంతా మంట లు వ్యాపించి పొగ కమ్ముకుని కనిపిస్తుంది. అసలే భానుడి వేడికి తోడు కార్చిచు మంటలు అంఅంటుకోవడంతో ఇక్కడ వాతావరణం మిగతా ప్రాంతాలకంటే అధిక వేడిని కలిగి ఉంటుంది. మహబూ బాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూ డూ రు,బయ్యారం, వరంగల్‌జిల్లాలోని ఖానాపురం, ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, మల్లంపల్లి మండలాల్లో ఈ పరిస్థితి ఉంటుంది.
అల్లాడుతున్న వన్యప్రాణులు
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వన్య ప్రాణులు, పక్షులకు నీరు లభించడం చాలా కష్టం. దీనికి తోడు అడవులు కాలుతుండడంతో వాటి గూడు చెదిరిపోతుంది. పక్షులు అడవిలో ఉండలేక వేడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. మంటల నుంచి తప్పించుకుని వన్యప్రాణులు జ నావాసాల్లోకి, పంట పొలాల వద్దకు వచ్చి వేటగాళ్ల ఉచ్చుల్లో పడుతున్నాయి. దీంతో పాటు విలువైన ఆయుర్వేద మొక్కలు అంతరించిపోతున్నాయి.
మంటలు ఆర్పడం సిబ్బందికి సవాలు
అడవుల్లో మంటలు ఆర్పడం అటవీ శాఖ సిబ్బందికి సవాలుగా మారుతోంది. ప్రభుత్వం మంటలార్పేందుకు అధునాతన మిషన్లు, నిధులు సమకూర్చినా క్షేత్ర స్థాయిలో ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రాత్రి పూట మంటలు అంటుకున్న సమయంలో ఆర్పడం సిబ్బందికి సాధ్యం కావడం లేదు. తెల్లవారే సరికి తీవ్ర నష్టం జరుగుతోంది. అడవుల్లో మంటలు విస్తరించకుండా వేసవికి ముందే కాలి బాటలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తీరా మంటలు అంటుకున్న తర్వాతే సిబ్బంది స్పందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అడవిలో మంటలకు తునికాకు కాంట్రాక్టర్లలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తునికాకు మోడెం కొట్టకుండా అడవులకు నిప్పు పెడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
కార్చిచ్చుతో వేసవిలో వేడెక్కుతున్న ఏజెన్సీ గ్రామాలు
ఎక్కడ చూసినా కాలుతున్న అడవి
కమ్ముకుంటున్న పొగ..అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు, వన్యప్రాణులు

అగ్గి.. అడవి బుగ్గి