
రైతులను మోసం చేసిన కాంగ్రెస్
హన్మకొండ: రైతులను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కార్యాలయంలో రైతు సత్యాగ్రహ దీక్ష సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో గోలి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. రైతు సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 4న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హనుమకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈసత్యాగ్రహ దీక్షకు బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపా రు. ఈనెల 4న హనుమకొండ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న దీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, కిసాన్ మోర్చా రాష్ట్ర బాధ్యులు జగన్ మోహన్‌రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి, నాయకులు పెద్ది మహేందర్‌రెడ్డి, పుల్యాల రవీందర్‌రెడ్డి, అమతరావు, నర్మెట్ట శ్రీనివాస్‌గౌడ్, కేతిపెల్లి సంపత్‌రెడ్డి, నాగరాజు, అరణ్యరెడ్డి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి
ఈనెల 4న రైతు సత్యాగ్రహ దీక్ష
బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ
నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి