Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్‌ వార్నింగ్!! | CP Anjani Kumar Warns To Pub Owners Over New Year Celebrations | Sakshi
Sakshi News home page

Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్‌ వార్నింగ్!!

Published Fri, Dec 24 2021 6:10 PM | Last Updated on Fri, Dec 24 2021 7:14 PM

CP Anjani Kumar Warns To Pub Owners Over New Year Celebrations - Sakshi

సిపి అంజనీ కుమార్

Omicron Restrictions In Hyderabad హైదరాబాద్‌: నూతన సంవత్సరవేడుకలు సందర్భంగా పబ్బుల యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మైనర్లకు లిక్కర్ అమ్మితే బార్లు, పబ్ లకు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సరాల వేడుకలు పై ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనల మేరకు ముందుకు పోతామన్నారు. ఆంక్షల ప్రకారమే సెలెబ్రేషన్స్‌ జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ తెలిపారు.

డిసెంబర్ 31 రాత్రి అన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని, వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని నగరవాసులకు సూచనలు జారీ చేశారు.

చదవండి: గుజరాత్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 4 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement