హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తండ్రి ముత్యాల బెంజమిన్ రంజిత్(81) బుధవారం సాయంత్రం ఏఐజీ హాస్పిటల్‌లో మరణించారు. గతంలో బెంజమిన్ రంజిత్ పోలీసు శాఖలో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. బెంజమిన్ రంజిత్ మృతి పట్ల డీజీపీ అంజనీకుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
1998లో తాను గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రంజిత్‌తో కలిసి పనిచేశానని, వృత్తిలో నిబద్ధత కలిగిన వ్యక్తి చనిపోవడం అత్యంత బాధాకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. బెంజమిన్ రంజిత్ అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం నారాయణగూడలోని ప్రొటెస్టంట్ సిమెట్రీలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment