కుమారుడిని కరిచిందనే కోపంతో.. | - | Sakshi

కుమారుడిని కరిచిందనే కోపంతో..

Nov 3 2024 6:30 AM | Updated on Nov 3 2024 7:04 AM

-

పెంపుడు కుక్కను భవనంపై నుంచి పడేసి చంపిన తండ్రి

 పోలీసులకు శునకం యజమానురాలి ఫిర్యాదు

అబిడ్స్‌: కుమారుడిని కరిచిందని ఆగ్రహానికి గురైన ఓ తండ్రి.. శునకాన్ని కొట్టడంతో పాటు దానిని భవనంపై నుంచి కింద పడేసి చంపిన ఘటన షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జుమ్మెరాత్‌బజార్‌ దేవినగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జి.రాజేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జుమ్మెరాత్‌బజార్‌ దేవినగర్‌ ప్రాంతంలో నివాసం ఉండే మల్లమ్మ అనే మహిళ శునకాన్ని పెంచుకుంటోంది.

 ఇదే ప్రాంతా నికి చెందిన సత్తులు అనే వ్యక్తి పది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు శుక్రవారం రాత్రి టపాసులు కాలుస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని టపాకాయలు మల్లమ్మకు చెందిన శునకంపై పడ్డాయి. కోపంతో అది సత్తులు కుమారుడిని కరిచింది. విషయం తెలుసుకున్న సత్తులు ఆగ్రహంతో శునకాన్ని కర్రతో కొట్టి భవనంపై అంతస్తు నుంచి కింద పడవేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. తన పెంపుడు కుక్కను చంపిన సత్తులుపై మల్లమ్మ షాహినాయత్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement