నీరా కేఫ్ ఎత్తేస్తే అడ్డుకుంటాం
ఖైరతాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైదరాబాద్ నడిబొడ్డున రూ.20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. విజయ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కల్లుగీత సంఘాల నాయకులు నీరా కేఫ్ భవన్‌ను పరిశీలించారు. అనంతరం బాగ్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆత్మగౌరవంతోపాటు వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు నీరా కేఫ్ ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల వృత్తిదారులు ప్రకృతి సిద్ధమైన పానియాన్ని నీరా రూపంలో ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. కొందరు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ఈ కేఫ్‌ను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. ప్రభుత్వ తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేదంటే గౌడ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బబ్బూరి బిక్షపతి, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment