
జనారణ్యంలోకి జింకపిల్ల
విజయనగర్‌కాలనీ: అరణ్యంలో ఉండాల్సిన ఓ జింక పిల్ల నగరంలో ప్రత్యక్షమైంది. గురువారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం నుంచి గుడిమల్కాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో మహ్మదీయ మజీద్ వద్ద రోడ్డుపై ఉదయం 9 గంటలకు ఓ జింకపిల్లను కుక్కలు తరుముతుండగా స్థానికులు గమనించి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు సాయికుమార్, పవన్‌లు జింకపిల్లను స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం సైఫాబాద్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ తమ సిబ్బందితో వచ్చి జింకపిల్లను తీసుకువెళ్లారు. జింకపిల్ల నగరంలోకి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడి పరిసరాల్లో అటవీ ప్రాంతం లేదని, జింకపిల్లను ఎవరైనా పెంచుకుంటుంటే తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment