లక్డీకాపూల్: గ్రేటర్ పరిధిలో భవన నిర్మాణాల అనుమతులు వేగవంతమవుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో గురువారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన ‘బిల్డ్ నౌ’పై జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బిల్డ్ నౌ అప్లికేషన్ అప్‌లోడ్ చేసే విధానంపై పలువురికి శిక్షణ కల్పించామన్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 9 వరకు నిర్వహించనున్నామన్నారు. మార్చి 10 నుంచి బిల్డ్ నౌ అప్లికేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంత్, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ సీసీపీలు గంగాధర్, ప్రదీప్ వీరన్న టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో అధికారుందరూ అందుబాటులో ఉండాలని, అందుకు సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు బాధ్యత వహించాలని సూచించారు. ప్రధాన కార్యాలయంలో విభాగాధిపతులు కూడా అందుబాటులో ఉండేందుకు తాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారి రాకపోకలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, అందుకోసం ఏఐతో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విభాగాధిపతులంతా సందర్శకుల సమయమైన సాయంత్రం 4నుంచి 5 గంటల మధ్య అందుబాటులో ఉండాలని ఇదివరకే ఆదేశించడం తెలిసిందే. అధికారులు అందుబాటులో ఉండాలని పునరుద్ఘాటించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
Comments
Please login to add a commentAdd a comment