సిటీ కోర్టులు : సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. కేసు విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంతో ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను మార్చ్ 5కు వాయిదా వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే, 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అసత్యపు ఆరోపణలు చేశారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో రేవంత్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే ఆరోపణలు చేయడంతోపాటు వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
విచారణను మార్చ్ 5కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Comments
Please login to add a commentAdd a comment