
నెలరోజుల క్రితం ఆత్మహత్య?
గచ్చిబౌలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానం ఎదురుగా ఉండే గుట్టవైపు వేపచెట్టుకు 35–40 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్థానికులు అటువైపు వెళ్లగా దుర్వాసన రావడంతో గమనించి మొబైల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా..మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా గుర్తించారు. కింద ఒక బ్యాగు అందులో షర్టులు, ప్యాంట్లు, ఒక కంటి అద్దాలు పెట్టుకొనే బాక్సు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దాదాపు నెల క్రితం ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment