కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం
సాక్షి, సిటీబ్యూరో: కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం చేయాలని వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రాజీరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంజీవరెడ్డి నగర్‌లోని యూనియన్ ఆఫీస్‌లో ప్రధాన కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో రాజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకు కలిసి కట్టుగా మందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సతీష్ కుమార్,జనరల్ సెక్రెటరీ రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు.