
స్టూడెంట్స్.. ఆల్ ది బెస్ట్!
నారాయణగూడలోని ఓ పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బంది
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం కోసం హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్ష కేంద్రాల్లో 85,753 మంది, రంగారెడ్డిలో 185 కేంద్రాల్లో 80,409, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 150 కేంద్రాల్లో 64,107 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులూ.. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించడమే మీ ముందున్న లక్ష్యం. ఆల్ ది బెస్ట్! – సాక్షి, సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment