సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పురపాలక సంఘాల్లో జీవో 51, అమృత్ పథకాల్లో మంజూరైన పనులపై తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి సమీక్షించారు. మంగళవారం తన కార్యాలయంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ విజిట్ నిర్వహించి పురపాలక సంఘాలు, స్థానిక ఎమ్మెల్యేలతో సమీక్షించనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘాలకు కొత్తగా మంజూరైన పనులు, వాటికి సంబంధించిన నిధులను వివరించారు. అమృత్ 2.0 ప్యాకేజీ–3 కింద సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ డివిజన్‌లకు రూ.130 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు విశ్వనాధ్ రాజు, చిన్నారావు, వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయి, ఈఈలు విజయభాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సందీప్, రమణ మూర్తి పాల్గొన్నారు.
జీఓ 51, అమృత్ పథకాల కింద
భారీగా మంజూరు
జీవో 51 పథకం కింద మంజూరైన నిధులిలా..
పురపాలక సంఘం మంజూరైన నిధులు (రూ.ల్లో)
పెద్ద అంబర్‌పేట రూ.15 కోట్లు
షాద్ నగర్ రూ.61 కోట్లు
ఇబ్రహీంపట్నం రూ.15 కోట్లు
శంకర్ పల్లి రూ.36 కోట్లు
కొత్తూరు రూ.37 కోట్లు
ఆమనగల్ రూ.25 కోట్లు
జల్‌పల్లి రూ.10 కోట్లు
శంషాబాద్ రూ.20 కోట్లు
ఆదిభట్ల రూ.10 కోట్లు
తుర్కయంజాల్ రూ.25 కోట్లు
బడంగ్పేట్ రూ.15 కోట్లు
జిల్లెలగూడ రూ.15 కోట్లు
తుక్కుగూడ రూ.15 కోట్లు
తాండూర్ రూ.49 కోట్లు
వికారాబాద్ రూ.8 కోట్లు
పరిగి రూ.4 కోట్లు
కొడంగల్ రూ.9 కోట్లు
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.25 కోట్లు
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.15 కోట్లు
అమృత్ పథకంలో మంజూరైన నిధులిలా..
పురపాలక సంఘం మంజూరైన నిధులు
కొడంగల్ రూ.3 కోట్లు
పరిగి రూ.11 కోట్లు
వికారాబాద్ రూ.8 కోట్లు
తాండూరు రూ.20 కోట్లు
శంకర్ పల్లి రూ.25 కోట్లు
ఆమనగల్ రూ.23 కోట్లు
కొత్తూరు రూ.13 కోట్లు
షాద్‌నగర్ రూ.20 కోట్లు
మేడ్చల్ సర్కిల్‌కు రూ.27 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment