
పేలిన సిలిండర్
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా
మూసాపేట: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి బాగ్‌అమీర్ కాలనీలో హరి శంకర్ త్యాగి అనే వ్యక్తి ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీస్ షాపును నిర్వహిస్తున్నాడు. మంగళవారం షాపులో పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. షట్టర్ పైభాగం రేకులు, షట్టర్‌లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షాపు పూర్తిగా ధ్వంసమైంది. రీఫిల్లింగ్ చేస్తున్న హరి శంకర్‌కు కాళ్లు, చేతులు కాలిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఒకరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment