
ఓయూలో ఉమెన్స్ డే వేడుకలు
పాల్గొన్న మంత్రి సీతక్క
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బుధవారం జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, ఫాస్టరింగ్ ఎంపవర్‌మెంట్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క మాట్లాడారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి సెక్రటరీ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, వీసీ ప్రొ.కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని, ఐసీఎస్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ ప్రొ.సుధాకర్ రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.లావణ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్కకు జార్జిరెడ్డి పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు వర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment