7 సబ్జెక్టుల్లో హెచ్‌సీయూ అదుర్స్
రాయదుర్గం: ప్రపంచంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అత్యుత్తమ వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. లండన్‌కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) సంస్థ బుధవారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2025ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో కొనసాగుతున్న 1,700 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలలో పని తీరు ఆధారంగా సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మన హెచ్‌సీయూ ఏడు సబ్జెక్టుల్లో మంచి ర్యాంకింగ్ సాధించినట్లు అందులో పేర్కొంది. సబ్జెక్టుల వారీగా.. ఇంగ్లిష్ లాంగ్వేజ్– లిటరేచర్‌లో 251– 300 ర్యాంకింగ్, లింగ్విస్టిక్స్‌లో 301–350, సోషియోలజీలో 310–375, కెమిస్ట్రీలో 451–500, ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్‌లో 501–550, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో 601–675, బయాలాజికల్ సైన్సెస్‌లో 651–700 ర్యాంకింగ్‌లను హెచ్‌సీయూ సాధించింది. ఈ సందర్భంగా మరింతగా శ్రమించి హెచ్‌సీయూ ఉనికిని విస్తరిస్తామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని సబ్జెక్టులలో మెరుగైన ప్రతిభ చాటేందుకు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment