సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో తమకు సహకరిస్తే హైదరాబాద్ స్ధానాన్ని ఇవ్వనున్నట్లు అధికార కాంగ్రెస్ ఎంఐఎంకు హామీ ఇచ్చినట్లు రాజకీయ ప్రచారం జరిగింది. ఆ లెక్కన కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి దింపదు. ఒకవేళ అలా కాకుండా కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దింపినా ఆ పార్టీకి తగినంత బలం లేదు. ఆ మాటకొస్తే.. ఒక్క ఎంఐఎంకు తప్ప మిగతా పార్టీలు వేటికి కూడా ఈ ఎన్నికల్లో గెలిచేంత బలం లేదు. ఈ ఎన్నికలో ప్రజలు ఎన్నుకున్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, లోక్‌సభ సభ్యులతో పాటు ఇక్కడ ఓటర్ల జాబితాలో పేరుండి జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఓట్లు వేసేందుకు అర్హత కలిగి ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు 110 మంది ఓటర్లున్నారు. వారిలో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. తుది జాబితా వెలువడేందుకు వచ్చే నెల 10వ తేదీ వరకు గడువున్నట్లు బల్దియా వర్గాల సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు జాబితాలో చేరనున్నారు. ఓటర్లు పెరిగే అవకాశముంది.
ఎంఐఎంకే మెజార్టీ..
ఏ లెక్కన చూసుకున్నా అత్యధిక ఓటర్ల బలం ఎంఐఎంకే ఉంటుంది. దాదాపు యాభై మంది ఓటర్ల బలం ఆ ఒక్క పార్టీకి మాత్రమే ఉంది. మిగతా ఏ ఒక్క పార్టీకి కూడా అంత బలం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా ఏ రెండు పార్టీలూ పొత్తులతో పోటీ చేసే అవకాశాలే లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనేది పేరుకు మాత్రమేననే అభిప్రాయాలున్నాయి. అసలు పోలింగ్ జరిగేంతదాకా ఈ ప్రక్రియ సాగే అవకాశాలు కూడా లేవు. త్వరలో పదవీకాలం పూర్తికానున్న ఎంఎస్ ప్రభాకర్‌రావు ఎన్నిక సైతం పోటీ లేకుండానే ఏకగ్రీవం కావడం తెలిసిందే. అప్పట్లో బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతునిచ్చింది. ఇప్పుడు ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతునిస్తూ తమ అభ్యర్థిని పోటీకి నిలపదనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రభాకర్‌రావు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉండటం తెలిసిందే.
కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకున్నా..
పార్టీల వారీగా ఓట్ల బలాల ప్రకారం..