Shocking Video: Talibans Surrounded News Anchor In Afghanistan - Sakshi
Sakshi News home page

Afghanistan: వైరల్‌ వీడియో.. తుపాకులు ఎక్కుపెట్టి మరీ!

Published Tue, Aug 31 2021 12:09 PM | Last Updated on Tue, Aug 31 2021 1:49 PM

Afghanistan: Taliban Fighters Surrounding News Anchor Watch What Happens - Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాము శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటించిన తాలిబన్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే మహిళలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక జర్నలిస్టులు, సాధారణ ప్రజలపై కూడా వారి అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయుధాలు చేతబట్టి ఓ న్యూస్‌ చానెల్‌లో ప్రత్యక్షమైన తాలిబన్లు.. యాంకర్‌కు తుపాకులు ఎక్కుపెట్టారు. 

తాము పూర్తిగా మారిపోయారని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలంటూ అతడిని బెదిరించారు. అందుకు సరేనన్న ఆ యాంకర్‌.. వారు చెప్పిన మాటలను అప్పజెప్పి.. బతుకు జీవుడా అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక నేటితో(ఆగష్టు 31)తో అఫ్గనిస్తాన్‌లో అమెరికా సేనల ఉపసంహరణ పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియో మరోసారి షేర్‌ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ఎంచక్కా తుపాకులు ఎక్కుపెట్టి.. మారిపోయామని చెప్పమన్నారు. తద్వారా తాము మారలేదని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు వారిని అడ్డుకునేందుకు అమెరికా సేనలు కూడా లేవు. ఇష్టారాజ్యం’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి:  ఇది మన విజయం; అమెరికాతో పాటు ఇతర దేశాలతో కూడా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement