
అమెరికాకు చెందిన 22 ఏళ్ల సోఫ్ మోస్కా ఓ లెస్బియన్ యువతి. కాగా తనకూ ప్రతి మహిళలానే ప్రెగ్నెంట్ కావడమంటే ఇష్టం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా లెస్బియన్స్ గర్భం దాల్చడం అనేది జరగదు. వారు పురుషులతో కలవడానికి ఇష్టపడరు. అయితే ఎందుకో తెలీదు కానీ సోఫ్‌కి మాత్రం ప్రెగ్నెట్ మహిళలంటే చాలా ఇష్టం. తానూ వారిలాగే గర్భం దాల్చాలనుకుంటుంది కానీ తనకు పిల్లలను కనడం మాత్రం ఇష్టంలేదు.
ఇక ఈ క్రమంలోనే తాను అనుకున్నది సాధించుకుంది. తన అభిరుచికి తగ్గట్టుగా తానూ గర్భం దాల్చింది. అయితే సోఫీ ఒక ఈజీ ట్రిక్‌తో ప్రెగ్నెంట్ అయింది. అదేంటంటే ఓ సిలికాన్ బేబీ బంప్‌ను పొట్ట వద్ధ ధరిస్తే చూడటానికి అచ్చం గర్భిణీ స్త్రీ లానే కనిపిస్తుంది. కనీసం డౌట్ కూడా రాదు. అయితే ఈ సిలికాన్ బేబీ బంప్ కోసం సోఫీ రూ.20వేలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.
ఇక దాంతో సోఫీ తనకు నచ్చినప్పుడల్లా గర్భిణిలా ఫొటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ తన విచిత్రమైన కోరికను నిరవేర్చుకుంటుంది. విశేషం ఏంటంటే ఇదే తనకు ఓ అలవాటుగా మారిపోయింది. కనీసం నెలలో ఒకసారైనా బేబీ బంప్‌ను ధరించి గర్భవతిగా మారిపోతుంది. ఇలా సోఫ్ మోస్కా తనను తానే ప్రెగ్నెంట్‌గా ఊహించుకొంటూ మురిసిపోతుంది.
తాజాగా సోఫ్ మోస్కా తాను ప్రెగ్నెంట్‌గా కనిపిస్తున్న వీడియోను తన ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీ కోరికను ఈ రూ.20వేల సిలికాన్ ప్రెగ్నెన్సీ బెల్లీతో నెరవేర్చుకుంటున్నట్టు తన పోస్ట్‌లో పేర్కొంది. ఇక తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment